ధనుష్ సెట్స్‌లో జాయినైన‌ రాశీఖన్నా

ABN , First Publish Date - 2021-08-28T17:40:26+05:30 IST

ధనుష్‌, మిత్రన్‌ జవహర్‌ కాంబినేషన్‌లో ‘తిరుచ్చిట్రాంబలం’ అనే ప్రాజెక్టు ఇటీవలే అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. గురువారం నుంచి షూటింగ్‌ ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌లో హీరోయిన్ రాశీఖన్నా సెట్స్‌లో జాయిన్ అయ్యింది.

ధనుష్ సెట్స్‌లో జాయినైన‌ రాశీఖన్నా

ధనుష్‌, మిత్రన్‌ జవహర్‌ కాంబినేషన్‌లో ‘తిరుచ్చిట్రాంబలం’ అనే ప్రాజెక్టు ఇటీవలే అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ‘యారడీ నీ మోహిని’, ‘ఉత్తమ పుత్తిరన్‌’, ‘కుట్టి’ వంటి విజయవంతమైన చిత్రాలను హీరో ధనుష్‌కు అందించిన మిత్రన్‌ ఈ కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. పైగా చాలా గ్యాప్‌ తర్వాత ధనుష్‌ - మిత్రన్‌ కాంబినేషన్‌లో ఈ చిత్రం రానుంది. అయితే, ఈ మూవీలో ధనుష్‌ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. వీరిలో నిత్యా మీనన్‌, రాశీ ఖన్నా, ప్రియా భవానీ శంకర్‌ ఉన్నారు. వీరితోపాటు స్టార్‌ దర్శకుడు భారతీరాజా, నటుడు ప్రకాష్‌ రాజ్‌ వంటి పలువురు సీనియర్‌ నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోగా, గురువారం నుంచి షూటింగ్‌ ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌లో హీరోయిన్ రాశీఖన్నా సెట్స్‌లో జాయిన్ అయ్యింది. ధ‌నుష్‌, రాశీఖన్నాల‌పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ విషయాన్ని రాశీ ఖన్నా తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించింది. అలాగే, షూటింగ్‌ లొకేషన్‌ నుంచి కూడా ఒక ఫొటో కూడా ఆమె తన ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

Updated Date - 2021-08-28T17:40:26+05:30 IST