సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Puneeth Rajkumar వ్యక్తిగత వైద్యుడి ఇంటి వద్ద భారీ భద్రత!

ABN, First Publish Date - 2021-11-08T16:15:55+05:30

కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ ఇక లేరనే విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ ఇక లేరనే విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం నటుడిగానే కాకుండా.. చిరస్మరణీయ సేవల ద్వారా పునీత్‌ ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నారు. రోజూ అనేకమంది వచ్చి ఆయన సమాధిని దర్శించుకుంటున్నారు. కాగా, పునీత్ రాజ్‌కుమార్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ రమణరావుకు అభిమానుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. 


రమణారావు నిర్లక్ష్యం వల్లే పునీత్ చనిపోయారని పలువురు అభిమానులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయనకు బెంగళూరు సిటీ పోలీసులు రక్షణ కల్పించారు. బెంగళూరులోని సదాశివనగర్‌లో ఉన్న ఆయన నివాసం, క్లినిక్ బయట కేఎస్ఆర్‌పీ ప్లాటూన్‌ను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పునీత్‌కు వైద్య చికిత్స అందించిన డాక్టర్ రమణరావు, ఇతర వైద్య నిపుణులకు రక్షణ కల్పించాలని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌ల అసోసియేషన్ (పీహెచ్ఏఎన్ఏ) కోరడంతో పోలీసులు ఈ భద్రత కల్పించారు.

Updated Date - 2021-11-08T16:15:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!