సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నెట్టింట్లో వైరల్‌గా మారిన Puneeth Rajkumar జిమ్ వీడియోలు

ABN, First Publish Date - 2021-10-29T22:49:41+05:30

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ 46ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. జిమ్ చేస్తుండగా ఆయన ఆకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ 46ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. జిమ్ చేస్తుండగా ఆయన ఆకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరకున్నారు. సమీపంలోని ఆస్పత్రికి ఆయనను తరలించగా అక్కడి వైద్యులు కార్డియాక్ అరెస్టుగా నిర్ధారించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. 


హీరో‌లు అంటేనే తమ బాడీని ఎప్పుడు ఫిట్ గా ఉంచాలి. స్టార్ హీరోలైనా సరే దీనికి అతీతులు కారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు వ్యాయామం చేయడమంటే ఎంతో ఇష్టం. తెల్లవారుజాము వరకు సినిమా షూటింగ్‌లు జరిగినప్పటికీ ఆయన వ్యాయామం చేయడం ఎప్పుడు మానలేదు. తన బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలనే తాపత్రయంతో ఆయన కఠిన వ్యాయామాలు చేసేవారని  మీడియా తెలుపుతోంది. ఈ నేపథ్యంలో ఆయన జిమ్‌లో వ్యాయామాలు చేసిన వీడియోల కోసం అభిమానులు వెతకడం మొదలు పెట్టారు.  ప్రస్తుతం వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆబ్స్, పుష్ ఆప్స్ చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. 





Updated Date - 2021-10-29T22:49:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!