పునీత్‌కు ‘కర్నాటక రత్న’ పురస్కారం
ABN , First Publish Date - 2021-11-16T22:57:57+05:30 IST
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. అక్టోబర్ 29న గుండెపోటు హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమకే తీరని లోటు. ఆయన మరణాన్ని ఇప్పటికీ కుటుంబ సభ్యుులు, సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చేసిన ఎన్నో సేవల్ని ఈ సందర్బంగా భారతీయ సినీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూ కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో పునీత్ రాజ్ కుమార్ కు కర్నాటక ప్రభుత్వం మరణానంతర పురస్కారం ఇవ్వాలని నిర్ణయించుకుంది.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. అక్టోబర్ 29న గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమకే తీరని లోటు. ఆయన మరణాన్ని ఇప్పటికీ కుటుంబ సభ్యుులు, సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చేసిన ఎన్నో సేవల్ని ఈ సందర్బంగా భారతీయ సినీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూ కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో పునీత్ రాజ్ కుమార్ కు కర్నాటక ప్రభుత్వం మరణానంతర పురస్కారం ఇవ్వాలని నిర్ణయించుకుంది. కర్నాటక రాష్ట్రానికే అత్యున్నత పురస్కారమైన ‘కర్నాటక రత్న’ అవార్డ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తీర్మానించారు.