సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తండ్రి బాట‌లోనే నడుస్తూ Puneeth Rajkumar కళ్ల దానం

ABN, First Publish Date - 2021-10-30T01:47:45+05:30

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 46ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. జిమ్‌లో వ్యాయామాలు చేస్తుండగా ఆయన అపస్మారక స్థితికి లోనయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 46ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. జిమ్‌లో వ్యాయామాలు చేస్తుండగా ఆయన అపస్మారక స్థితికి లోనయ్యారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా కార్డియాక్ అరెస్టుగా డాక్టర్లు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాలని అక్కడి డాక్టర్లు సూచించారు. అనంతరం ఆయనను విక్రమ్ ఆసుపత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో కన్నడ సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. తమ అభిమాన హీరో మృతి చెందడంతో అభిమానుల రోదనలు మిన్నంటాయి. మృతి చెందాక కూడా మరొకరికి ఉపయోగపడాలని పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అనుకున్నారు. 


ఆయన అవయవ దానానికి పూనుకున్నారు. ఈ విషయంలో తన తండ్రి అడుగుజాడల్లోనే నడిచారు. తన కళ్లను ఆయన దానం చేశారు. ఆయన తండ్రి కూడా కళ్లను దానం చేసిన సంగతి తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ తన కళ్లను నారాయణ నేత్రాలయ ఆస్పత్రికి దానం చేసినట్టు తెలుస్తోంది.

Updated Date - 2021-10-30T01:47:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!