సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇతడి చేతిలో ఉన్న చిన్న పెట్టెలో ఏమున్నాయో తెలుసా..? Puneeth Rajkumar మరణించిన తర్వాత..

ABN, First Publish Date - 2021-10-30T18:05:14+05:30

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ మరణంతో కర్ణాటక అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ మరణంతో కర్ణాటక అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. కంఠీరవ స్టేడియంలో అభిమానులు, సినీ ప్రముఖులు పునీత్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. అమెరికా నుంచి పెద్ద కూతురు వచ్చిన తర్వాత కంఠీరవ స్టూడియోలో తండ్రి సమాధి పక్కనే పునీత్ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 


సామాజిక స్పృహ కలిగిన పునీత్ ఎంతో మందికి తన వంతు సహాయ సహకారాలు అందించారు. అంతేకాదు తన మరణం తర్వాత కూడా ఆయన మరొకరి జీవితంలో వెలుగులు నింపబోతున్నారు. ఆయన తన కళ్లను దానం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పునీత్ మరణాన్ని వైద్యులు అధికారికంగా ధ్రువీకరించారు. ఆ వెంటనే అంత బాధలోనూ పునీత్ సోదరుడు రాఘవేంద్ర నేత్రదాన కార్యక్రమాన్ని పూర్తి చేయించారు. డాక్టర్ రాజ్‌కుమార్ ఐ బ్యాంక్ పునీత్ కళ్లను భద్రపరిచింది. పునీత్ తల్లిదండ్రులు కూడా గతంలో వారి కళ్లను దానం చేశారు.  



Updated Date - 2021-10-30T18:05:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!