సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఉదయం 11.20 గంటలకు భార్యతో సహా నా దగ్గరకు వచ్చారు.. అసలేం జరిగిందో చెప్పిన Puneeth Rajkumar ఫ్యామిలీ డాక్టర్

ABN, First Publish Date - 2021-10-30T23:21:00+05:30

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ల వయసులో గుండె పోటుతో మరణించారు. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అకస్మాత్తుగా ఆయన అపస్మారక స్థితికి లోనయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ పవర్ స్టార్  పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ల వయసులో గుండె పోటుతో మరణించారు. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అకస్మాత్తుగా ఆయన అపస్మారక స్థితికి లోనయ్యారు. సమీపంలోని కుటుంబ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా  మెరుగైన చికిత్స చికిత్స కోసం విక్రమ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆ ఆస్పత్రి వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. ఆయన మృతితో కన్నడ సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ఆదివారం నాడు జరగనున్నాయి. 


పునీత్ రాజ్ కుమార్ ఉదయం భార్యతో సహా కుటుంబ వైద్యుడైన రమణ రావ్ దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో పవర్ స్టార్ పరిస్థతి ఏవిధంగా ఉందో ఆయన వివరించారు. ‘‘ ఉదయం 11.20 నిమిషాలకు పునీత్ భార్య అశ్వినితో సహా నా దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో ఆయన రక్తపోటు, హృదయ స్పందనలు మాములుగానే ఉన్నాయి. రక్తపోటు మాత్రం 150/92‌గా నమోదు అయింది.  గుండెలో నొప్పి గురించి ఆయన చెప్పలేదు. ఊపిరితిత్తులు కూడా బాగానే ఉన్నాయి. మాములు వ్యాయామాలతో పాటు బాక్సింగ్ చేసినట్టు చెప్పారు. నేను వెంటనే ఈసీజీ పరీక్ష చేశాను. ఆయన గుండె కొంచెం ఒత్తిడికి గురైనట్టుగా ఆ రిపోర్టులో తేలింది. దీంతో విక్రమ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలన్నాను. ఆ ఆస్పత్రికి చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే అకస్మాత్తుగా ఆయన మరణించారు’’ అని కుటుంబవైద్యుడైన రమణ రావ్ చెప్పారు. 


‘‘ రోజు వారి దినచర్యలో భాగంగా ఆయన జిమ్ చేశారు. కసరత్తులు ఎంత వరకు చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన ఔషధాలను ఉపయోగించినట్టు కూడా నాకు గుర్తుకు లేదు. వయసు కూడా తక్కువగానే ఉంటుంది. టెన్షన్ వంటి సమస్యలు కూడా లేవు. కానీ, గుండెలో నొప్పి రావడంతోనే మరణించాల్సి వచ్చింది  ’’ అని ఆ కుటుంబ వైద్యుడు తెలిపారు.

Updated Date - 2021-10-30T23:21:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!