సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

puneeth Rajkumar చనిపోవడానికి సరిగ్గా రెండ్రోజుల ముందు హీరో Yash ను ఎందుకు కలిశారు..? ఇద్దరూ కలిసి ఏం చేశారు..?

ABN, First Publish Date - 2021-10-30T17:09:39+05:30

ప్రముఖ హీరో పునీత్ రాజ్‌కుమార్ మృతితో కన్నడ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ హీరో పునీత్ రాజ్‌కుమార్ మృతితో కన్నడ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. చిన్న వయసులోనే పునీత్ ఈ లోకాన్ని వీడడం ఆయన అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తుతోంది. జిమ్‌లో వ్యాయామం చూస్తూ శుక్రవారం ఉదయం పునీత్ గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే. తను చనిపోవడానికి రెండ్రోజుల ముందు పునీత్ తన సోదరుడు శివ రాజ్‌కుమార్, కేజీఎఫ్ స్టార్ యశ్‌తో కలిసి ఓ ప్రోగ్రామ్‌కు హాజరయ్యాడు. 


శివరాజ్‌కుమార్ నటించిన `భజరంగీ-2` సినిమా ప్రమోషన్ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి పునీత్, యశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ సినిమా టైటిల్ సాంగ్‌కు ముగ్గురూ కలిసి చిందులేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పునీత్ మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులే కాదు.. అన్ని భాషలకు చెందిన నటులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. 



Updated Date - 2021-10-30T17:09:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!