సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘విశ్వాసం’ ఇమ్మాన్‌కు నిర్మాత అభినందనలు

ABN, First Publish Date - 2021-03-27T00:27:35+05:30

‘విశ్వాసం’ చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న డి. ఇమ్మాన్‌ను ఆ చిత్ర నిర్మాత అభినందించారు. 67వ జాతీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్: ‘విశ్వాసం’ చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న డి. ఇమ్మాన్‌ను ఆ చిత్ర నిర్మాత అభినందించారు. 67వ జాతీయ అవార్డులలో భాగంగా కోలీవుడ్‌కు ఏకంగా ఏడు అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడుగా హీరో ధనుష్‌ ఎంపికయ్యారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘అసురన్‌’ నిలిచింది. అలాగే స్టార్‌ హీరో అజిత్‌ - నయనతార జంటగా నటించిన ‘విశ్వాసం’ చిత్ర సంగీత దర్శకుడు డి.ఇమ్మాన్‌కు కూడా జాతీయ అవార్డు వచ్చింది. ‘విశ్వాసం’ చిత్రాన్ని నిర్మాత టీజీ త్యాగరాజన్‌ సత్యజ్యోతి ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మించారు. ఈ నేపథ్యంలో డి.ఇమ్మాన్‌ను నిర్మాత స్వయంగా కలిసి అభినందించారు. కాగా ‘విశ్వాసం’ చిత్రాన్ని డైరెక్టర్‌ శివ రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌తో 'అణ్ణాత్త' చిత్రాన్ని రూపొందిస్తున్నారు.



Updated Date - 2021-03-27T00:27:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!