నిలకడగా కమల్ హాసన్ ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-11-24T21:37:39+05:30 IST

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘ఇండియన్ 2, విక్రమ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. డిసెంబర్ నుంచి శంకర్ ‘ఇండియన్ 2’ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుండగా.. లోకేశ్ కనగరాజ్ ‘విక్రమ్’ చిత్రం ప్రస్తుతం సెట్స్ మీదుంది. ఈ క్రమంలో కమల్ హాసన్.. రీసెంట్ గా కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకి కరోనా పాటిటివ్ రాగా.. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో ఆయనకి ట్రీట్ మెంట్ జరుగుతోంది.

నిలకడగా కమల్ హాసన్ ఆరోగ్యం

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘ఇండియన్ 2, విక్రమ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. డిసెంబర్ నుంచి శంకర్ ‘ఇండియన్ 2’ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుండగా.. లోకేశ్ కనగరాజ్ ‘విక్రమ్’ చిత్రం ప్రస్తుతం సెట్స్ మీదుంది. ఈ క్రమంలో కమల్ హాసన్.. రీసెంట్ గా కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకి కరోనా పాటిటివ్ రాగా.. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో ఆయనకి ట్రీట్ మెంట్ జరుగుతోంది. దాంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ రోజు (బుధవారం) కమల్ ఆరోగ్యం పై ఆసుపత్రి వర్గాల వారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆయన  ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని తెలిపారు. 



Updated Date - 2021-11-24T21:37:39+05:30 IST