సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘మైడియర్‌ భూతం’గా ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్.. ఫస్ట్ లుక్ వైరల్

ABN, First Publish Date - 2021-12-14T00:42:14+05:30

‘ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌’ ప్రభుదేవా వరుస చిత్రాలకు కమిట్‌ అవుతున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. వీటిలో కొన్ని షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌’ ప్రభుదేవా వరుస చిత్రాలకు కమిట్‌ అవుతున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. వీటిలో కొన్ని షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మరో చిత్రానికి కమిట్‌ అయ్యారు. గతంలో ‘మంజాపై’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన రాఘవన్‌ దర్శకత్వంలో ‘మైడియర్‌ భూతం’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రమ్యా నంబీశన్‌ హీరోయిన్‌. డి.ఇమ్మాన్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని చిన్నారులను లక్ష్యంగా చేసుకుని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. ఇందులో ప్రభుదేవా ‘భూతం’గా నటిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  


ఇదిలావుంటే, బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్‌తో ప్రభుదేవా ‘రాధే’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఇది బాక్సాఫీస్‌ వద్ద పూర్తిగా నిరాశపరిచింది. దీంతో దర్శకత్వానికి గ్యాప్‌ ఇచ్చి ప్రభుదేవా పూర్తిస్థాయి నటుడుగా మారారు. ఇందులో భాగంగా ఆయన పలు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. వీటిలో ‘తేల్‌’ చిత్రం ఈ నెల 10వ తేదీన విడుదల కావాల్సి వుండగా, ఉన్నట్టుండి వాయిదా వేశారు. అదేవిధంగా ‘బగీరా’, ‘పొయ్‌కాల్‌ గుదిరై’, ‘ఫ్లాష్‌బ్యాక్‌’ వంటి మూవీలతో పాటు మరికొన్ని చిత్రాల్లో ప్రభుదేవా హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నారు.

Updated Date - 2021-12-14T00:42:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!