ఆరేళ్ల తర్వాత ‘కనెక్ట్’ అవుతోన్న నయనతార దర్శకుడు
ABN , First Publish Date - 2021-12-29T03:05:20+05:30 IST
సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్న నయనతార ప్రధాన పాత్రలో ‘మాయ’ అనే చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరకెక్కించారు. ఈ చిత్రం ఆరేళ్ళ క్రితం వచ్చింది. ఆ తర్వాత ఆయన ఒక్క సినిమాకు కూడా
సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్న నయనతార ప్రధాన పాత్రలో ‘మాయ’ అనే చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరకెక్కించారు. ఈ చిత్రం ఆరేళ్ళ క్రితం వచ్చింది. ఆ తర్వాత ఆయన ఒక్క సినిమాకు కూడా దర్శకత్వం వహించలేదు. ఇప్పుడు ఓ సరికొత్త ప్రాజెక్టుతో ఒక చిత్రాన్ని రూపొందించనున్నారు. సీనియర్ నటుడు సత్యరాజ్, బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించే ఈ చిత్రానికి ‘కనెక్ట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పృథ్వి చంద్రశేఖర్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని కోలీవుడ్ ప్రేమజంట నయనతార, విఘ్నేష్‌లు కలిసి తమ సొంత నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి సత్యరాజ్‌తో కూడిన ఓ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.