సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మూడు సినిమాలతో రాబోతున్న నయనతార

ABN, First Publish Date - 2021-06-20T18:23:13+05:30

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార నటించిన మూడు సినిమాలు ఈ ఏడాదిలో విడుదల కాబోతున్నట్టు సమాచారం. కరోనా మహమ్మారి ఉధృతి సమయంలోనూ ఈ లేడి సూపర్ స్టార్ నుంచి మూడు సినిమాలు రాబోతుండటం ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార నటించిన మూడు సినిమాలు ఈ ఏడాదిలో విడుదల కాబోతున్నట్టు సమాచారం. కరోనా మహమ్మారి ఉధృతి సమయంలోనూ ఈ లేడి సూపర్ స్టార్ నుంచి మూడు సినిమాలు రాబోతుండటం ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయట. అందుకే ఆమె లేడీ సూపర్ స్టార్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారట. గత ఏడాది కరోనా సమయంలోనే 'ముక్కుత్తి అమ్మన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం తమిళ, తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. అమ్మవారిపాత్రలో నయన్ బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా వరుసగా మూడు సినిమల షూటింగ్స్‌లో పాల్గొన్నారు. ఇప్పటికే 'నేత్రికన్' చిత్రాన్ని పూర్తి చేశారు. అంధురాలి పాత్రలో నయన్ నటిస్తుండగా మిలింద్ రావ్ తెరకెక్కించారు.  థియేటర్లు ఓపెన్ లేకపోవడంతో ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు. త్వరలోనే 'నేత్రికన్' ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ రానుంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'అణ్ణాత్త'లోనూ హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అలాగే ఆమె ప్రియుడు విగ్నేశ్ శివన్ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న ఇందులో మరో స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే దీని చిత్రీకరణ కూడా మొదలయింది. ఏడాది చివరిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా నయనతార 2021 లో మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది.  

Updated Date - 2021-06-20T18:23:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!