సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వినూత్నంగా Marakkar ప్రమోషన్ కార్యక్రమాలు

ABN, First Publish Date - 2021-11-30T00:31:43+05:30

సినిమా అంటేనే క్రియేటివ్ ఫీల్డ్. ఎల్లప్పుడు కొత్తగా ఆలోచిస్తుండాలి. సరికొత్త పద్ధతులను అవలంభిస్తుండాలి. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకు రావడానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా అంటేనే క్రియేటివ్ ఫీల్డ్. ఎల్లప్పుడు కొత్తగా ఆలోచిస్తుండాలి. సరికొత్త పద్ధతులను అవలంభిస్తుండాలి. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకు‌రావడానికి  ప్రమోషన్స్‌ను కొత్తగా చేయాలి. కోవిడ్ విలయతాండవం చేయడంతో ప్రేక్షకులు ఓటీటీలకే అతుక్కు పోతున్నారు. అందువల్ల ఆడియన్స్‌ను థియేటర్లకు తీసుకురావడానికి హీరోలు, నిర్మాతలు ప్రమోషన్స్‌ను‌ ‌వినూత్నంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఒక చిత్ర ప్రచార కార్యక్రమాలను క్రూయిజ్‌షిప్‌లో నిర్వహించారు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.    


మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘‘ మరక్కార్: అరేబియా సముద్ర సింహం ’’. ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. ఆంటోని పెరంబవూర్ నిర్మించారు. రూ.100కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 3న విడుదల కాబోతోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. మలయాళం సినీ చరిత్రలోనే వినూత్నంగా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను క్రూయిజ్‌షిప్‌లో నిర్వహించారు. ఇండియన్ నేవీకి చెందిన కొంత మంది అధికారులు, ఎంపిక చేసిన అభిమానులు క్రూయిజ్ షిప్‌లో హీరో మోహన్ లాల్‌తో కలిసి రైడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. 



Updated Date - 2021-11-30T00:31:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!