ఓటీటీలోకి వచ్చేస్తోన్న మరక్కార్-అరేబియా సముద్ర సింహం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ABN , First Publish Date - 2021-12-14T02:21:30+05:30 IST
విడుదలకు ముందే పలు జాతీయ అవార్డులను సొంతం చేసుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా ‘‘ మరక్కార్-అరేబియా సముద్ర సింహం

విడుదలకు ముందే పలు జాతీయ అవార్డులను సొంతం చేసుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా ‘‘ మరక్కార్-అరేబియా సముద్ర సింహం ’’. పాన్ ఇండియాగా రూపొందిన ఈ చిత్రం డిసెంబరు 2న థియేటర్లల్లో విడుదల అయింది. ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విజువల్స్ పరంగా చిత్రం ఆకట్టుకున్నప్పటికి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ అంచనాలను అందుకోలేకపోయింది. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళంలో ఈ చిత్రం విడుదలైంది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కాబోతుందని తెలుస్తోంది.
అమెజాన్ ప్రైమ్ మరక్కార్ విడుదల తేదీని ప్రకటించింది. ఆ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో డిసెంబర్ 17నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతోందని తెలుస్తోంది. సినిమా విడుదలైన 2వారాలకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రాబోతుండటం విశేషం. ఈ సినిమాను ప్రియదర్శన్ తెరకెక్కించారు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరంబవూర్ నిర్మించారు.మోహన్‌లాల్, సుహాసిని, సునీల్ శెట్టి, అర్జున్ సర్జా, కీర్తి సురేష్, మంజు వారియర్, నెడుముడి వేణు తదితరులు కీలక పాత్రలు పోషించారు.