సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దృశ్యం సినిమాలో నటనతో అదరగొట్టిన Mohanlal.. కానీ ఈ సినిమా ఆఫర్ మొదట ఏ స్టార్ హీరో దగ్గరకు వెళ్లిందంటే..

ABN, First Publish Date - 2021-09-26T20:36:08+05:30

దృశ్యం సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని కురిపించింది. మోహన్‌లాల్ నటించిన ఈ చిత్రం అభిమానులను అలరించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. జీతుజోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్, టాలీవుడ్‌లోకి రీమేక్ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: దృశ్యం సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని కురిపించింది. మోహన్‌లాల్ నటించిన ఈ చిత్రం అభిమానులను అలరించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. జీతుజోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్, టాలీవుడ్‌లోకి రీమేక్ అయింది. ఈ సినిమాలో మోహన్‌లాల్ తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. కానీ, మొదట ఈ సినిమా ఆఫర్  మోహన్‌లాల్‌కు బదులు వేరే స్టార్ హీరో దగ్గరకు వెళ్లింది. 



మలయాళ స్టార్‌హీరో మమ్ముట్టి దగ్గరకు మొదట ఈ కథ వెళ్లింది. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆయన ఈ సినిమాను అంగీకరించలేదు. కానీ, ఈ సినిమాకు తన పూర్తి మద్దతును ప్రకటించారు. తన అభిమానులందరూ  తప్పకుండా ఈ చిత్రాన్ని వీక్షించాలన్నారు. మమ్ముట్టి అంచనాలకు తగినట్టుగానే 2013లో విడుదలైన ఈ సినిమా మాలీవుడ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. 


Updated Date - 2021-09-26T20:36:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!