#Brodaddy : సూపర్ హిట్ కాంబో రిపీట్స్
ABN , First Publish Date - 2021-12-30T16:28:57+05:30 IST
మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, యంగ్ సూపర్ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్. వీరి కలయికలో వచ్చిన ‘లూసిఫర్’ చిత్రం కేరళ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇందులో పృధ్విరాజ్ ప్రత్యేక పాత్ర పోషించడమే కాకుండా.. తొలిసారిగా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. చిన్నప్పటి నుంచి మోహన్ లాల్ ను ఎంతగానో ఆరాధించే పృధ్విరాజ్ కి.. ఆయన్ను ఎలా చూపిస్తే అభిమానులు ఊగిపోతారో బాగా తెలుసు. అందుకే ఆ సినిమాలో మోహన్ లాల్ హీరోయిజాన్ని హై రేంజ్ లో ఎలివేట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, యంగ్ సూపర్ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్. వీరి కలయికలో వచ్చిన ‘లూసిఫర్’ చిత్రం కేరళ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇందులో పృధ్విరాజ్ ప్రత్యేక పాత్ర పోషించడమే కాకుండా.. తొలిసారిగా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. చిన్నప్పటి నుంచి మోహన్ లాల్ ను ఎంతగానో ఆరాధించే పృధ్విరాజ్ కి.. ఆయన్ను ఎలా చూపిస్తే అభిమానులు ఊగిపోతారో బాగా తెలుసు. అందుకే ఆ సినిమాలో మోహన్ లాల్ హీరోయిజాన్ని హై రేంజ్ లో ఎలివేట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అలాంటి ఈ కాంబో ఇప్పుడు రిపీట్ అవుతోంది. సినిమా పేరు ‘బ్రోడాడీ’. దీనికి కూడా పృధ్విరాజ్ సుకుమారనే దర్శకుడు. కాకపోతే ఈ సినిమాలో పృధ్విరాజ్ ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 26న డిస్నీ హాట్ స్టార్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్బంగా ‘బ్రోడాడీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. మోహన్ లాల్, పృధ్విరాజ్ సూట్స్ లో మెరిసిపోయే లుక్ వైరల్ అవుతోంది.
కేవలం నలభై రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు పృధ్విరాజ్. సినిమా మొత్తం హైదరాబాద్ లోనే చిత్రీకరించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటనీ పెరుంబవూర్ నిర్మాణంలో ‘బ్రోడాడీ’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా కోసం ఈ ఇద్దరూ కలిపి ఒక పాట పాడడం కూడా విశేషం. ఇక పృధ్విరాజ్ మోహన్ లాల్ తో లూసిఫర్ సినిమా ప్రీక్వెల్ ‘ఎంపురాన్’ ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. అలాగే.. మోహన్ లాల్ మొట్టమొదటి సారిగా దర్శకుడిగా తెరకెక్కిస్తున్న బరోజ్ చిత్రంలో పృధ్విరాజ్ ఒక ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. మొత్తానికి మోహన్ లాల్, పృధ్విరాజ్ కాంబో సెన్సేషనే అన్నమాట.