సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బోల్డ్‌ సీన్లకు దూరం.. మెహరీన్ తాజా వ్యాఖ్యలివి!

ABN, First Publish Date - 2021-12-29T02:25:00+05:30

అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు క్రేజ్‌ను సంపాదించుకున్న హీరోయిన్ మెహరీన్‌ ఫిర్జాదా.. బోల్డ్‌ సన్నివేశాల్లో నటించేందుకు నిరాకరిస్తోంది. కథ డిమాండ్‌ చేసినప్పటికీ లిప్‌లాక్‌, బెడ్రూంలో సన్నిహితంగా మెలిగే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు క్రేజ్‌ను సంపాదించుకున్న హీరోయిన్ మెహరీన్‌ ఫిర్జాదా.. బోల్డ్‌ సన్నివేశాల్లో నటించేందుకు నిరాకరిస్తోంది. కథ డిమాండ్‌ చేసినప్పటికీ లిప్‌లాక్‌, బెడ్రూంలో సన్నిహితంగా మెలిగే సీన్లకు ఆమె నో చెబుతోంది. ‘నెంజిల్‌ తుణివిరుందాల్‌’, ‘నోటా’, ‘పట్టాస్‌’ వంటి తమిళ చిత్రాల్లో నటించిన ఆమె తమిళ ప్రేక్షకులకు సుపరిచితమే. గత కొంతకాలంగా కోలీవుడ్‌కు దూరంగా ఉన్నప్పటికీ, టాలీవుడ్‌లో మాత్రం బిజీగా ఉంది. ఇప్పటికే పలు చిత్రాల్లో బికినీ, స్విమ్‌సూట్‌లు ధరించిన ఈ నటి.. ఇపుడు బోల్డ్‌ సన్నివేశాల్లో నటించేందుకు సమ్మతించడం లేదు. ఇదే విషయంపై ఆమె వద్ద సంప్రదించగా, ‘అలాంటి సన్నివేశాల్లో నటించి నేను ధైర్యవంతురాలిని అని ప్రూవ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని ఆమె స్పష్టం చేసింది. 

Updated Date - 2021-12-29T02:25:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!