విజయ్ ఆంటోనీ - విజయ్ మిల్టన్ చిత్రానికి హీరోయిన్ ఖరారు
ABN , First Publish Date - 2021-12-28T02:01:10+05:30 IST
కోలీవుడ్ చిత్రసీమలో హీరో విజయ్ ఆంటోని నటించే ‘మళై పిడిక్కాద మనిదన్’ అనే మూవీలో హీరోయిన్‌గా తన అందచందాలతో వెండితెరకు మరింత అందం చేకూర్చే మేఘా ఆకాష్‌ను ఎంపికచేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న విజయ్ మిల్టన్

కోలీవుడ్ చిత్రసీమలో హీరో విజయ్ ఆంటోని నటించే ‘మళై పిడిక్కాద మనిదన్’ అనే మూవీలో హీరోయిన్‌గా తన అందచందాలతో వెండితెరకు మరింత అందం చేకూర్చే మేఘా ఆకాష్‌ను ఎంపికచేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న విజయ్ మిల్టన్ ఈ చిత్రానికి కథను సమకూర్చి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ - కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందించనున్న ఈ చిత్రం షూటింగ్ డామన్ అండ్ డయ్యు ప్రాంతంలో జరుపనున్నారు. ఈ ప్రాంతంలో షూటింగ్ జరుపుకునే తొలి తమిళ చిత్రం ఇదే కావడం గమనార్హం.
కన్నడ చిత్ర సీమకు చెందిన ఇద్దరు టాలెంట్ నటులు ధనుంజయ, పృథ్వీ అంబర్‌లు ఈ మూవీ ద్వారా కోలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. విజయ్ ఆంటోనీ - విజయ్ మిల్టన్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీలోని పాటలకు విజయ్ ఆంటోనీ స్వరాలు సమకూర్చితే, అచ్చు రాజామణి నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై నిర్మాతలు కమల్ బొహ్రా, లలితా ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బొహ్రా, ఎస్.విక్రమ్‌లు కలిసి నిర్మిస్తున్నారు.