శివుడిపై ‘మాయన్’.. నాలుగు భాషల్లో!
ABN, First Publish Date - 2021-08-14T00:47:39+05:30
కోలీవుడ్‌లో 56 సంవత్సరాల తర్వాత శివుడిని ప్రధాన కథాంశంగా చేసుకుని ‘మాయన్’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఉన్నత సాంకేతిక విలువలు, గ్రాఫిక్స్, భారీ బడ్జెట్‌తో
కోలీవుడ్‌లో 56 సంవత్సరాల తర్వాత శివుడిని ప్రధాన కథాంశంగా చేసుకుని ‘మాయన్’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఉన్నత సాంకేతిక విలువలు, గ్రాఫిక్స్, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నిర్మితమవుతోంది. ‘మాయన్’ అంటే కాలభైరవుడి కుమారుల్లో ఒకరు. అలాంటి మాయాన్లకు మన పూర్వీకులకు మంచి సంబంధం ఉండేదని పురాణాల్లో ఉంది. ఈ చారిత్రక ఆధారంతో తెరకెక్కిన చిత్రమే ‘మాయన్’.
దేశంలో తొలి కమర్షియల్ ఆంగ్ల చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ‘మాయన్’తో వినోద్ అనే నటుడు కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. హీరోయిన్లుగా ప్రియాంకా మోహన్, బిందు మాధవి, పియా బాజ్‌పేయి నటిస్తున్నారు. వీరితో పాటు జాన్ విజయ్, దినా, గంజా కరుప్పు, ఆడుగళం నరేన్, కేకే మేనన్ సహా పలువురు నటిస్తున్నారు. వీరంతా ఆంగ్ల వెర్షన్ కోసం ఇంగ్లీష్‌లోనే డబ్బింగ్ చెప్పడం గమనార్హం. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు, రచన, దర్శకత్వం రాజేష్ కణ్ణ. ఈ చిత్రాన్ని జీవీకేఎం ఎలిఫెంట్ పిక్చర్స్ సహకారంతో ఫాక్స్ అండ్ క్రో స్టూడియోస్ పతాకంపై నిర్మించారు.