సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన మణిరత్నం

ABN, First Publish Date - 2021-06-04T15:29:27+05:30

జూన్ 2వ తేదీన మణిరత్నం పుట్టినరోజు కావడంతో ఆ రోజున ఖచ్చితంగా ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక సమాచారాన్ని వెల్లడిస్తారని సినీ అభిమానులు భావించారు. కానీ, చిత్ర యూనిట్‌ మాత్రం ఇవేమీపట్టించుకోలేదు. దీంతో సినీ జనం తీవ్ర నిరాశకు లోనయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ నవలలను అమితంగా ఇష్టపడే రీడర్స్‌కు కల్కి రాసిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ నవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నవలను చదివిన ప్రతి ఒక్కరూ అందులోని పాత్రలను ఊహించుకుంటూ కాలం వెళ్ళదీస్తుంటారు. అలాంటి నవల ఇప్పుడు దృశ్యరూపంగా రానుంది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఆ బాధ్యతలను స్వీకరించారు. రెండు భాగాలుగా ఈ దృశ్యకావ్యం రానుంది. విక్రమ్‌, కార్తీ, జయం రవి, విక్రమ్‌ ప్రభు, శరత్‌ కుమార్‌, పార్తీపన్‌, ప్రభు, జయరాం, ప్రకాష్‌ రాజ్‌, రెహమాన్‌, లాల్‌, అశ్వన్‌ కక్కుమన్ను, ఐశ్వర్యా రాయ్‌, ఐశ్వర్యా లక్ష్మి, శోభిత ఇలా... భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చే ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ థాయ్‌లాండ్‌లో గత 2019లో జరిగింది. 


ఆ తర్వాత హైదరాబాద్‌, చెన్నై తదితర ప్రాంతాల్లో జరిపారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ఈ చిత్రం షూటింగును ఆపేశారు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం తొలి భాగం షూటింగును ఇప్పటికే పూర్తి చేసినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. రెండో భాగం కూడా చాలామేరకు పూర్తి చేసినట్టు వినికిడి. ఇంత జరుగుతున్నప్పటికీ.. చిత్రానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క అప్‌డేట్‌ కూడా ఇంతవరకు బయటకురాలేదు. 2వ తేదీన మణిరత్నం పుట్టినరోజు కావడంతో ఆ రోజున ఖచ్చితంగా ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక సమాచారాన్ని వెల్లడిస్తారని సినీ అభిమానులు భావించారు. కానీ, చిత్ర యూనిట్‌ మాత్రం ఇవేమీపట్టించుకోలేదు. దీంతో సినీ జనం తీవ్ర నిరాశకు లోనయ్యారు.

Updated Date - 2021-06-04T15:29:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!