రికార్డు సృష్టించిన మమ్ముట్టి ఫ్యాన్స్

ABN , First Publish Date - 2021-12-02T22:52:34+05:30 IST

ఏ హీరో ఫ్యాన్స్ అయినా సినిమా రిలీజ్ రోజున థియేటర్స్ లో ఫ్లెక్సీలు కట్టడం క్వైట్ కామన్. అలాగే.. కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం, సినిమా రన్ అవుతుంటే థియేటర్స్ లో హారతులివ్వడం కూడా చేస్తుంటారు. అయితే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఫ్యాన్స్ మాత్రం దీనికి కొంచెం భిన్నంగా ఒక పని చేసి ఏకంగా రికార్డే నెలకొల్పారు. వాళ్ళు చేసిన పనేంటో తెలుసా? మమ్ముట్టి కొత్త చిత్రం పూజా కార్యక్రమం రోజున థియేటర్స్ లో ఫ్లె్క్సీలు కట్టి గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కేరళలోని వివిధ ప్రాంతాల్లోని 66 థియేటర్స్ లో ఫ్లెక్సీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

రికార్డు సృష్టించిన మమ్ముట్టి ఫ్యాన్స్

ఏ హీరో ఫ్యాన్స్ అయినా సినిమా రిలీజ్ రోజున థియేటర్స్ లో ఫ్లెక్సీలు కట్టడం క్వైట్ కామన్. అలాగే.. కటౌట్లకు పాలాభిషేకాలు, సినిమా రన్ అవుతుంటే థియేటర్స్ లో హారతులివ్వడం కూడా చేస్తుంటారు. అయితే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఫ్యాన్స్ మాత్రం దీనికి కొంచెం భిన్నంగా ఆలోచించి ఏకంగా రికార్డే నెలకొల్పారు. వాళ్ళు చేసిన పనేంటో తెలుసా? మమ్ముట్టి కొత్త చిత్రం పూజా కార్యక్రమం రోజున థియేటర్స్ లో ఫ్లెక్సీలు కట్టి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కేరళలోని వివిధ ప్రాంతాల్లోని 66 థియేటర్స్ లో ఫ్లెక్సీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలా ఒక సినిమా పూజా కార్యక్రమం రోజున ఫ్లెక్సీలు కట్టడం అన్నది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది మొదటి సారి.


ఇంతకీ మమ్ముట్టి నటిస్తోన్న ఆ కొత్త సినిమా పేరేంటో తెలుసా? ‘సిబీఐ 5’. గతంలో ఈ సిరీస్ లో నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. ‘ఒరు సిబీఐ డైరీ కురిప్పు, నేరరియాన్ సిబీఐ, జాగ్రత్త, సేతురామయ్యర్ సిబీఐ’ గా విడుదలైన ఈ సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ఒక హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగుతాడు సిబీఐ ఆఫీసర్ సేతురామయ్యర్. షర్ట్ నలగకుండా.. తన తెలివితేటలతో అసలు నేరస్తుడ్ని పట్టుకోవడం ఆకట్టుకుంటుంది. ఈ నాలుగు సినిమాలకి కె.మధు దర్శకత్వం వహించారు. ఇప్పుడు రాబోయే ఐదో సినిమాకి కూడా ఆయనే దర్శకుడు. ఈ సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంఛ్ అయింది.  ఈ భాగం కథాంశం బాస్కెట్ కిల్లింగ్స్ చుట్టూ సాగుతుంది. గత నాలుగు చిత్రాలకు స్ర్కిప్ట్ అందించిన యస్.యన్.స్వామినే దీనికి కూడా కథ అందించారు. 

Updated Date - 2021-12-02T22:52:34+05:30 IST