నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ లిస్ట్‌లో దూసుకుపోతున్న ‘‘ మిన్నల్ మురళి ’’

ABN , First Publish Date - 2021-12-29T23:21:16+05:30 IST

‘‘ బాహుబలి ’’ సినిమాలతో దక్షిణాది సినిమాల సత్తా ప్రపంచానికి తెలిసొచ్చింది. యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం, బాలీవుడ్ హీరోల

నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ లిస్ట్‌లో దూసుకుపోతున్న ‘‘ మిన్నల్ మురళి ’’

‘‘ బాహుబలి ’’  సినిమాలతో దక్షిణాది సినిమాల సత్తా ప్రపంచానికి తెలిసొచ్చింది. యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం, బాలీవుడ్ హీరోల సినిమాలతో సమానంగా వసూళ్లను రాబట్టింది. అయితే, ఒక మలయాళం సినిమా కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ లిస్ట్‌లో దూసుకుపోతుంది.  ఆ చిత్రం పేరు ‘‘ మిన్నల్ మురళి ’’. 


మలయాళంలో ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన యువ నటుడు టొవినో థామస్‌ ‘‘ మిన్నల్ మురళి ’’ లో  హీరోగా నటించారు. గురు సోమసుందరం విలన్ పాత్రను పోషించారు. ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 24న ఈ చిత్రం  విడుదలైంది. సూపర్ హీరో జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు అభిమానుల మన్ననలు దక్కడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. 


కథలకు సరిహద్దులు ఉండవని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలో నెట్‌‌ఫ్లి‌క్స్ గ్లోబల్ ట్రెండ్ లిస్ట్‌లో 4వ స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లోని నాన్ ఇంగ్లిష్ ఫిలింస్ కేటగీరీలో గ్లోబల్ టాప్ 10లిస్ట్‌లో ఈ మూవీకి  4వ స్థానం దక్కింది. ఈ చిత్రం 11దేశాల్లో టాప్ 10 లిస్ట్‌లో నిలవడం గమనార్హం. ఇండియా, ఒమన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ దేశాల్లో ఈ సినిమా టాప్ 1గా ట్రెండ్ అయింది.

Updated Date - 2021-12-29T23:21:16+05:30 IST