సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మలయాళ నటుడు నెడుముడి వేణు ఇక లేరు

ABN, First Publish Date - 2021-10-12T06:10:45+05:30

‘భారతీయుడు’ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా, ‘అపరిచితుడు’ సినిమాలో హీరో విక్రమ్‌ తండ్రిగా నటించిన మలయాళ నటుడు నెడుముడి వేణు సోమవారం ఉదయం కన్నుమూశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘భారతీయుడు’ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా, ‘అపరిచితుడు’ సినిమాలో హీరో విక్రమ్‌ తండ్రిగా నటించిన మలయాళ నటుడు నెడుముడి వేణు సోమవారం ఉదయం కన్నుమూశారు. 73 ఏళ్ల వేణుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరోనా బారిన పడి కోలుకున్న వేణు కొన్ని రోజులుగా ఉదర సంబంధమైన వ్యాధితో బాధ పడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురై సోమవారం కన్నుమూశారు. నెడుముడి వేణు తెలుగు చిత్రాల్లో నటించకపోయినప్పటికీ అనువాద చిత్రాల ద్వారా తెలుగువారికి సుపరిచితుడే.  రంగ స్థల నేపథ్యం కలిగిన వేణు తమిళ, మలయాళ భాషల్లో 500కి పైగా చిత్రాల్లో నటించారు. 1978లో వచ్చిన ‘తంబు’( మలయాళం) వేణు తొలి సినిమా.   1979లో భరతన్‌ దర్శకత్వంలో రూపొందిన  ‘తకారా’ మలయాళ చిత్రం వేణు అద్భుత నటనని ఆవిష్కరించింది. ఆ సినిమా తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకొనే అవసరం ఆయనకు కలగలేదు. అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్న వేణు మూడు జాతీయ అవార్డులు, ఆరు సార్లు కేరళ ప్రభుత్వ అవార్డులు అందుకొన్నారు. నటుడిగానే కాకుండా మృదంగ విద్వాంసుడిగా, జానపద గాయకుడిగా వేణు పేరొందారు. ప్రస్తుతం ‘భారతీయుడు 2’ సహా మరికొన్ని చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. 


Updated Date - 2021-10-12T06:10:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!