సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హాలీవుడ్‌ చిత్రంలో మలయాళ కుర్రోడు

ABN, First Publish Date - 2021-09-22T20:48:55+05:30

కేరళకు చెందిన ఎబిన్‌ ఆంటోనీ అనే యువకుడు హాలీవుడ్‌ చిత్రంలో నటించారు. ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో రిలీజైన ‘స్పోకెన్‌’ అనే చిత్రంలో ఎబిన్‌ నటించారు. ఈ చిత్రానికి టెనిల్‌ రాన్‌సమ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్‌ను ప్రేమించే ఒక సంగీత కళాకారుడి పాత్రలో నటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేరళకు చెందిన ఎబిన్‌ ఆంటోనీ అనే యువకుడు హాలీవుడ్‌ చిత్రంలో నటించారు. ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో రిలీజైన ‘స్పోకెన్‌’ అనే చిత్రంలో ఎబిన్‌ నటించారు. ఈ చిత్రానికి టెనిల్‌ రాన్‌సమ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్‌ను ప్రేమించే ఒక సంగీత కళాకారుడి పాత్రలో నటించారు. చెన్నైలో పుట్టిపెరిగిన ఎబిన్‌కు చిన్న వయస్సు నుంచే సినిమాల్లో నటించాలన్న కోరిక ఉండేది. అందుకు అనుగుణంగానే శిక్షణ తీసుకున్నారు. ముఖ్యంగా  ఈ యువకుడు కాలేజీలో చదువుకుంటూనే తమిళం, ఆంగ్ల చిత్రాలకు కార్టూన్‌ వేస్తూ మంచి గుర్తింపుపొందారు. ఈ గుర్తింపే ఎబిన్‌కు సినిమాల్లో నటించే అవకాశం కల్పించింది. 


తన నటన నైపుణ్యాన్ని పెంచుకునేందుకు అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో ఉన్న న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడెమీలో శిక్షణ తీసుకున్నారు. అక్కడ అనేక మంది హాలీవుడ్‌ ప్రముఖుల వద్ద ఎబిన్‌ శిక్షణ తీసుకున్నారు. ఎబిన్‌ నటించిన రెండో చిత్రం ‘స్పోకెన్‌’. దీనికంటే ముందుగా ఆయన ‘బట్టర్‌ఫ్లైస్‌’ అనే చిత్రంలో నటించగా అది త్వరలోనే విడుదలకానుంది. హాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నాయని అలాగే, దక్షిణాది భాషల్లో కూడా నటిం చాలని ఉందని ఎబిన్‌ ఆంటోనీ ఆశాభావం వ్యక్తం చేశారు. 



Updated Date - 2021-09-22T20:48:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!