సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కొత్త కోణంలో మాళవిక గ్లామర్

ABN, First Publish Date - 2021-11-09T20:00:20+05:30

పుట్టింది కేరళ. పెరిగింది ముంబై. కానీ ఆమె గ్లామర్ బ్యూటీగా పేరు తెచ్చుకున్నది మాత్రం కోలీవుడ్ లో. ఆ సుందరి పేరు మాళవికా మోహనన్. తండ్రి ప్రముఖ సినిమాటో గ్రాఫర్ కె.యూ. మోహనన్. ఈయన మహేశ్ బాబు ‘మహర్షి’ చిత్రానికి కెమేరా మేన్ గా వర్క్ చేశారు. మలయాళ చిత్రంతో కథానాయికగా అడుగుపెట్టినప్పటికీ ఆ తర్వాత ఆమె తమిళ, కన్నడ హిందీ చిత్రాల్లో సైతం నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుట్టింది కేరళ. పెరిగింది ముంబై. కానీ ఆమె గ్లామర్ బ్యూటీగా పేరు తెచ్చుకున్నది మాత్రం కోలీవుడ్ లో. ఆ సుందరి పేరు మాళవికా మోహనన్. తండ్రి ప్రముఖ సినిమాటో గ్రాఫర్ కె.యూ. మోహనన్. ఈయన మహేశ్ బాబు ‘మహర్షి’ చిత్రానికి కెమేరా మేన్ గా వర్క్ చేశారు. మలయాళ చిత్రంతో కథానాయికగా అడుగుపెట్టినప్పటికీ ఆ తర్వాత ఆమె తమిళ, కన్నడ హిందీ చిత్రాల్లో సైతం నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఇప్పటి వరకూ ఆమె ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. రజినీకాంత్ ‘పేట్ట’ సినిమాతో కోలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు మాళవిక. ఆ తర్వాత విజయ్ మాస్టర్ మూవీలో హీరోయిన్ గా నటించి క్రేజీ హీరోయిన్ అనిపించుకున్నారు. ప్రస్తుతం ధనుష్ మారన్ లోనూ, ‘యుధిర’ అనే హిందీ చిత్రంలోనూ నటిస్తున్నారు. 



ఇక మాళవికా మోహన్ కు మరో వ్యాపకం సోషల్ మీడియా. ప్రస్తుతం ఆమె ఇన్ స్టా ఖాతాలో బోలెడంత మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోస్ ను షేర్ చేస్తూ.. నెటిజెన్స్ ను ఊరించడం అమ్మడి నిత్య కృత్యం. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. పూర్తిగా గ్రామీణ గెటప్ లో చీరకట్టులో రివీలైన ఆమె గ్లామర్ కుర్రకారును ఫిదా చేస్తోంది. వివిధ భంగిమల్లో ఆమె ఇచ్చిన పోజెస్ ఆకట్టుకుంటున్నాయి. మరి దీంతో ఆమెను అవకాశాలు వెల్లువలా ముంచెత్తుతాయేమో చూడాలి. 



Updated Date - 2021-11-09T20:00:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!