సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

గిరిజన విద్యార్థులకు మాళ‌వికా మోహ‌న‌న్ సాయం

ABN, First Publish Date - 2021-07-26T20:41:18+05:30

‘పేట’, ‘మాస్టర్‌’ వంటి చిత్రాల్లో నటించిన మాళవికా మోహనన్‌ అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఆమె లేటె్‌స్టగా నటించిన చిత్రం ‘మాస్టర్‌’. సినిమాల్లోనే కాకుండా ఈ అమ్ముడు సామాజిక సేవలోనూ తన వంతు పాత్రను పోషిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పేట’, ‘మాస్టర్‌’ వంటి చిత్రాల్లో నటించిన మాళవికా మోహనన్‌ అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఆమె లేటె్‌స్టగా నటించిన చిత్రం ‘మాస్టర్‌’. ఈ మూవీ తర్వాత పలు చిత్రాల్లో నటించేందుకు ఆమె కమిట్‌ అయ్యింది. అదేసమయంలో ఆమె సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా వుంటుంది. అప్పుడప్పుడూ హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తుంటుంది. మరోవైపు, సామాజిక సేవలోనూ తన వంతు పాత్రను పోషిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా విద్యా సంస్థలన్నీ మూసివేశారు. ఈ కారణంగా చదువులన్నీ ఆన్‌లైన్‌ తరగతుల రూపంలో బోధిస్తున్నారు. 


అయితే, అనేక కొండప్రాంత గ్రామాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం లేదు. ఒక ఈ సౌలభ్యం వుంటే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వంటివి అందుబాటులో ఉండవు. ఇలాంటి వారికి తనవంతు సాయం చేసేందుకు ఆమె ముందుకు వచ్చింది. తన సొంత రాష్ట్రమైన కేరళలోని వయానాడు ప్రాంతంలో అనేక కొండప్రాంత గ్రామాలు వుండగా, ఇక్కడ గిరిజన తెగలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు వంటివి లేవు. అందుకే ఓ స్వచ్చంధ సంస్థతో చేతులు కలిపిన మాళవికా, ఇప్పటివరకు 8 ట్యాబ్‌లెట్స్‌, ఏడు స్మార్ట్‌ ఫోన్లు ఒక ల్యాప్‌టాప్‌లు అందజేసింది. అలాగే, మరికొంతమందికి సాయం చేసేందుకు నిధుల సేకరణకు కూడా ఆమె శ్రీకారం చుట్టింది. ఆమె పిలుపునకు స్పందించిన అనేక మంది ఆమె అభిమానులు తమకు తోచిన సాయం చేస్తున్నారు. 

Updated Date - 2021-07-26T20:41:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!