గిరిజన బాలల విద్య కోసం హీరోయిన్‌ తాపత్రయం

ABN , First Publish Date - 2021-06-23T22:14:06+05:30 IST

2015లో నేను తొలిసారి వయనాడులో గిరిజన తెగలకు చెందిన ప్రజలను కలుసుకునేందుకు వెళ్ళాను. ఆ ప్రాంతం ఎంతగానో నా మనస్సును తాకింది. ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలు తగిన గుర్తింపుకోసం

గిరిజన బాలల విద్య కోసం హీరోయిన్‌ తాపత్రయం

2013లో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వచ్చిన ‘పట్టంపోల’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన భామ మాళవికా మోహనన్‌. ఆ తర్వాత కన్నడ, హిందీ భాషల్లో నటించింది. కార్తీక్‌ సుబ్బురాజ్‌, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పేట’ చిత్రంతో ఆమె తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ఈ అమ్మడికి స్టార్‌ హీరో విజయ్‌ సరసన నటించే గోల్డెన్‌ ఛాన్స్‌ వరించింది. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మాస్టర్‌’ చిత్రంలో విజయ్‌కు జోడీగా నటించి మెప్పించింది. ఇపుడు జాతీయ ఉత్తమ నటుడు ధనుష్‌ సరసన నటిస్తోంది. ఈ మూవీకి కార్తిక్‌ నరేన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, వెబ్‌సిరీస్‌ల్లో కూడా నటిస్తోంది. ఇదిలావుండగా ఈ నటి ఇప్పుడు గిరిజన బాలబాలికలకు విద్యనందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం తనవంతుగా నిధులు సేకరిస్తోంది. ఇదే విషయంపై ఆమె తాజాగా తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేసింది. 


ఇందులో ''2015లో నేను తొలిసారి వయనాడులో గిరిజన తెగలకు చెందిన ప్రజలను కలుసుకునేందుకు వెళ్ళాను. ఆ ప్రాంతం ఎంతగానో నా మనస్సును తాకింది. ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలు తగిన గుర్తింపుకోసం ఆరాటపడుతున్నారు. కనీస విద్య, వైద్య సదుపాయాలు లేకుండా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే చిన్నారులకు ల్యాప్‌టాప్‌ లేదా స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడం వల్ల వారి విద్యాభ్యాసానికి ఎలాంటి అంతరాయం లేకుండా సాగిపోతుందని నిధుల సమీకరణకు శ్రీకారం చుట్టాను. అందువల్ల మీరు కూడా మీకు తోచిన విధంగా విరాళాలు ఇవ్వండి" అని మాళవిక కోరింది.



Updated Date - 2021-06-23T22:14:06+05:30 IST