పునీత్ చివరి సినిమా డబ్బింగ్ కోసం లేటెస్ట్ టెక్నాలజీ

ABN , First Publish Date - 2021-11-01T16:37:27+05:30 IST

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం యావత్ భారతీయ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించింది. అతి చిన్నవయసులోనే తనువు చాలించడంతో ఆయన కో స్టార్స్, అభిమానులు ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు. పునీత్ ఆఖరుగా కన్నడ తెరపై కనిపించిన చిత్రం ‘యువరత్న’. ఈ సినిమా లాక్ డౌన్ టైమ్ లో డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై.. మంచి సక్సెస్ సాధించింది. తెలుగు వెర్షన్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆయన నటిస్తోన్న చిత్రం ‘జేమ్స్’. ఈ మూవీకి సంబంధించి పునీత్ యాక్షన్ పార్ట్ పూర్తయిందట.

పునీత్ చివరి సినిమా డబ్బింగ్ కోసం లేటెస్ట్ టెక్నాలజీ

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం యావత్ భారతీయ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించింది. అతి చిన్నవయసులోనే తనువు చాలించడంతో ఆయన కో స్టార్స్, అభిమానులు ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు. పునీత్ ఆఖరుగా కన్నడ తెరపై కనిపించిన చిత్రం ‘యువరత్న’. ఈ సినిమా లాక్ డౌన్ టైమ్ లో డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై.. మంచి సక్సెస్ సాధించింది. తెలుగు వెర్షన్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆయన చనిపోక ముందు షూటింగ్ మధ్యలో ఉన్న చిత్రం ‘జేమ్స్’. ఈ మూవీకి సంబంధించి పునీత్ యాక్షన్ పార్ట్ పూర్తయిందట. అలాగే సినిమా కూడా చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ చేసుకుందట. ఈ సినిమాను అభిమానుల కోసం వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. అయితే ఆయన వాయిస్  కాకుండా వేరే వాయిస్ తో డబ్బింగ్ చెప్పిస్తే.. ఎవరికీ సంతృప్తికరంగా ఉండదనిపించి.. దీని కోసం సరికొత్త టెక్నాలజీ ఉపయోగించబోతున్నారట. ‘జేమ్స్’ షూటింగ్ సమయంలో పునీత్ రాజ్ కుమార్ పలికిన డైలాగ్స్ ను.. సరికొత్త టెక్నాలజీతో క్వాలిటీ పెంచి విజువల్స్ కు సింక్ చేయబోతున్నారని సమాచారం. దీని కోసం ఓ ముంబై కంపెనీ రంగంలోకి దిగుతోంది. వచ్చే ఏడాది మార్చ్ 17న పునీత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట. పునీత్ తో ‘రాజకుమార’ అనే సూపర్ హిట్ సినిమా తీసిన చేతన్ కుమార్ ‘జేమ్స్’ కు దర్శకుడు. ఈ సినిమా పై మంచి పాజిటివ్ బజ్ ఉంది. ఈ సినిమాని తొందరలోనే ముగించి విడుదల తేదీ ప్రకటించాలి అనుకొనే లోపే పునీత్ చనిపోవడం అందరినీ బాధిస్తోంది. అభిమానుల చివరి జ్ఞాపకంగా మిగిలిపోయిన ‘జేమ్స్’ సినిమాకి కన్నడనాట ఏ రేంజ్ లో ఆదరణ దక్కుతుందో చూడాలి. Updated Date - 2021-11-01T16:37:27+05:30 IST