సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

గుండెపోటు రావడానికి కొద్ది గంటల ముందు Puneeth Rajkumar చేసిన ట్వీట్ ఇది..!

ABN, First Publish Date - 2021-10-29T21:17:25+05:30

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. ఆయన అకాల మరణంతో అశేష అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు, స్టార్ హీరోలు, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. స్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. ఆయన అకాల మరణంతో అశేష అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు, స్టార్ హీరోలు, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. స్వయంగా కూడా వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. అభిమాన హీరోను చివరి సారి కళ్లారా చూసుకునేందుకు కోట్లాది మంది అభిమానులు పునీత్ రాజ్ కుమార్ ఇంటికి తరలి వస్తున్నారు. 



ఇదిలా ఉండగా..  అభిమానులే కాదు.. అసలు చావు తనను వెతుక్కుంటూ ఇలా వస్తుందని పునీత్ రాజ్ కుమార్ కూడా అస్సలు ఊహించలేదనడానికి ఆయన చివరి సారి చేసిన ట్వీటే సాక్ష్యంగా కనిపిస్తోంది. గుండెపోటు రావడానికి కొద్ది గంటల ముందు తన సోదరుడు శివరాజ్ కుమార్ సినిమా అయిన భజరంగీ 2 సినిమాకు విషెష్ కూడా చెప్పారు. ‘భజరంగీ 2 సినిమా టీం అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ ఇదీ ఆయన చేసిన చివరి ట్వీట్. చావు పొంచి ఉందని తెలియక తన రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా వ్యాయామం చేస్తుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూనే పునీత్ రాజ్ కుమార్ అశేష అభిమానులను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.



Updated Date - 2021-10-29T21:17:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!