సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హాలీవుడ్‌ రేంజ్‌లో.. 3 పార్ట్‌లుగా గుప్తనిధుల కథ

ABN, First Publish Date - 2021-08-15T01:36:32+05:30

ఒక గుప్తనిధుల కథ. హాలీవుడ్‌లో వచ్చిన ‘ఇండియానా జోన్స్‌’, ‘ట్రజర్‌ హంట్‌’ స్థాయిలో ఉంటుంది. ఒక్క పాయింట్‌ను బేస్‌ చేసుకుని కథను డెవలప్‌ చేశాం. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా విడుదల చేసేలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మాత నుంచి దర్శకుడిగా అవతారమెత్తిన సీవీ కుమార్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కొట్రవై’. నూతన నటీనటులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను హాలీవుడ్‌ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇందులో రాజేష్‌ కనకసభ, చంద్ర, సుభిక్ష, అనుమహా కుమార్‌, వేల్‌ రామమ్మూర్తి సహా పలువురు నటిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.


ఈ చిత్రం గురించి దర్శకనిర్మాత సీవీ కుమార్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్‌ చూసిన తర్వాత చాలా మంది ఇది ఒక భక్తి చిత్రమని భావిస్తున్నారు. కానీ ఇది తమిళుల కులదైవంగా భావించే ‘కొట్రవై’ చుట్టూ సాగే ఒక గుప్తనిధుల కథ. హాలీవుడ్‌లో వచ్చిన ‘ఇండియానా జోన్స్‌’, ‘ట్రజర్‌ హంట్‌’ స్థాయిలో ఉంటుంది. ఒక్క పాయింట్‌ను బేస్‌ చేసుకుని కథను డెవలప్‌ చేశాం. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా విడుదల చేసేలా ప్లాన్‌ చేశాం. ఇప్పటికే తొలి భాగం షూటింగ్‌ పూర్తయింది. మొదటి భాగంలో గుప్త నిధుల అన్వేషణపై సాగుతుంది. ఇపుడు రెండో భాగం షూటింగ్‌ జరుగుతుంది. దీని తర్వాత మూడో భాగం షూట్‌ చేస్తాము. ఈ చిత్రంలో అధికంగా కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ సన్నివేశాలు ఉంటాయి.. వాటిని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-08-15T01:36:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!