కమల్ సినిమాకి 'కేజీఎఫ్' స్టంట్ మాస్టర్స్
ABN , First Publish Date - 2021-06-13T13:27:35+05:30 IST
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. ఈ చిత్రానికి 'కేజీఎఫ్' స్టంట్ మాస్టర్స్ అన్బు-అరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ అందివ్వనున్నారు. ఈ విషయాన్ని తాజాగా లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 'కేజీఎఫ్' చిత్రానికి అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన అన్బు-అరివ్.. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. ఈ చిత్రానికి 'కేజీఎఫ్' స్టంట్ మాస్టర్స్ అన్బు-అరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ అందివ్వనున్నారు. ఈ విషయాన్ని తాజాగా లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 'కేజీఎఫ్' చిత్రానికి అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన అన్బు-అరివ్.. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వీరు ప్రభాస్ నటిస్తున్న 'సలార్', రవితేజ 'ఖిలాడి', సూర్య40 చిత్రాలకు స్టంట్ మాస్టర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా కమల్ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో లెజండ్ కమల్ సార్‌తో ప్రారంభించడానికి ఎగ్జైటింగ్‌గా ఉన్నామని అన్బు-అరివ్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించబోతున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.