చివరి దశలో.. స్టార్ హీరోయిన్లు నటిస్తోన్న చిత్రం

ABN , First Publish Date - 2021-07-19T01:02:20+05:30 IST

ఐదుగురు హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ‘కరుంగాప్పియం’ మూవీ ఫస్ట్‌లుక్‌ను తాజాగా రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. స్టార్‌ హీరోయిన్లు కాజల్‌ అగర్వాల్‌, రెజీనా కెసాండ్రా, జనని, రైజా విల్సన్‌తో

చివరి దశలో.. స్టార్ హీరోయిన్లు నటిస్తోన్న చిత్రం

ఐదుగురు హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ‘కరుంగాప్పియం’ మూవీ ఫస్ట్‌లుక్‌ను తాజాగా రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. స్టార్‌ హీరోయిన్లు కాజల్‌ అగర్వాల్‌, రెజీనా కెసాండ్రా, జనని, రైజా విల్సన్‌తో పాటు మరో నటి నటిస్తోన్న ఈ చిత్రాన్ని ‘యామిరుక్క భయమే’, ‘కవలై వేండామ్‌’, ‘కాట్టేరి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన డీకే తెరకెక్కిస్తున్నారు. ఐదుగురు హీరోయిన్లతో పాటు కలైయరసన్‌, యోగిబాబు, కరుణాకరన్‌, జాన్‌ విజయ్‌, షా రా, లొల్లు సభ మనోహర్‌, విజే పార్వతి, వీజే ఆషిక్‌ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. వీరితో పాటు ఇరాన్‌ నటి నొయ్‌రికా ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు తొలిసారి పరిచయమవుతోంది. విక్కీ ఛాయాగ్రహకుడుగా పనిచేస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌. ప్రసాద్‌ సంగీతం సమకూర్చుతున్నారు. స్టంట్స్‌ అశోక్‌, ఎడిటింగ్‌ విజయ్‌, ఆర్ట్స్‌ డైరక్టర్‌గా రాఘవన్‌ పనిచేయనున్నారు. కేవలం మహిళను కేంద్ర బిందువుగా చేసుకుని తెరకెక్కించే ‘కరుంగాప్పియం’ చిత్రం వెట్రివేల్‌ టాకీస్‌, పేవ్‌ఎంటర్‌టైన్మెంట్స్‌, ఏబీ ఇంటర్నేషనల్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఫస్ట్‌ లుక్‌తో విడుదలతో పాటు ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకున్నట్లుగా చిత్రయూనిట్‌ ప్రకటించింది.

Updated Date - 2021-07-19T01:02:20+05:30 IST