సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాయ్‌కాట్ చేస్తాం.. అల్లు అర్జున్ Pushpa సినిమాకు కొత్త సమస్య..

ABN, First Publish Date - 2021-12-16T21:13:32+05:30

ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘‘ పుష్ప: ది రైజ్’’. రష్మిక మందన్న హీరోయిన్‌గా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘‘ పుష్ప: ది రైజ్’’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 17న వరల్డ్ వైల్డ్‌గా విడుదల కాబోతోంది.  పాన్ ఇండియాగా ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఈ చిత్రం విడుదల కావడానికి ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ సినిమా ఒక సమస్యలో ఇరక్కుంది.  


ఈ సినిమాను బాయ్‌కాట్ చేస్తామని కర్ణాటక అభిమానులు హెచ్చరిస్తున్నారు. కర్ణాటకలో కన్నడ వెర్షన్ కంటే కూడా తెలుగు వెర్షన్‌కే ఎక్కువ స్ర్కీన్స్ కేటాయించారని వారు మండిపడుతున్నారు. కన్నడ వెర్షన్‌కు ఎక్కువ స్క్రీన్స్ కేటాయిచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలా చేయని పక్షంలో ఈ సినిమా విడుదలను బాయ్‌కాట్ చేస్తామని అంటున్నారు. #BoycottPushpaInKarnataka అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-12-16T21:13:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!