సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నెరవేరనున్న కన్నడ స్టార్ Puneeth Rajkumar కల.. మ్యూజియంగా..

ABN, First Publish Date - 2021-12-15T14:57:11+05:30

కన్నడ ‘పవర్ స్టార్’ పునీత్ రాజ్‌కుమార్ ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతి కర్ణాటకలోని ఆయన అభిమానులతో పాటు వివిధ సినీ పరిశ్రమల ప్రముఖులు నివాళులు అర్పించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ ‘పవర్ స్టార్’ పునీత్ రాజ్‌కుమార్ ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతి కర్ణాటకలోని ఆయన అభిమానులతో పాటు వివిధ సినీ పరిశ్రమల ప్రముఖులు నివాళులు అర్పించారు. అయితే ఈయన తండ్రి సూపర్ స్టార్ రాజ్‌కుమార్, ఆయన పూర్వీకులు నివసించిన గాజానూర్‌లోని ఇంటిని మ్యూజియంగా మార్చాలని పునీత్ భావించారు.


తాజాగా ఆయన సంకల్పం కార్యరూపం దాల్చుతోంది. దీని కోసం చనిపోవడానికి కొన్ని నెలల ముందు ఆ ఇంటిని సందర్శించారు పునీత్. అయితే ఈ ఏడాది ఆగస్టులో విపరీతంగా వర్షాలు పడడంతో ఆ ఇల్లు చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. దీంతో రాజ్‌కుమార్ మేనల్లుడు గోపాల్ ఆ ఇంటిని పునరుద్దరించే పనిలో పడ్డారు. వేగంగా జరుగుతున్న రిపేరు పనులు మరో రెండు, మూడు నెలల్లో ఓ కొలిక్కి వస్తాయి. కాగా పునీత్ అన్నలు శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ ఈ ఊరిని త్వరలోనే సందర్శంచే అవకాశం ఉంది.


గోపాల్ ఈ ఇంటి గురించి మాట్లాడుతూ.. ‘ఇలాంటి దయనీయ స్థితిలో ఈ ఇంటిని చూడడం ఎంతో బాధగా ఉంది. కన్నడిగుల మనసులో నిలిచిపోయే ఎన్నో మంచి జ్ఞాపకాలు ఇందులో ఉన్నాయి. పని పూర్తికాగానే డాక్టర్ రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, వారి కుటుంబ సభ్యుల అరుదైన ఫోటోలను గోడలపై పెడతామ’ని తెలిపాడు. మరో గ్రామస్థుడు రమేష్.. చామరాజనగర్, తమిళనాడు సందర్శించే పర్యాటకులకు ఇది అదనపు ఆకర్షణగా ఉంటుందని చెప్పాడు.

Updated Date - 2021-12-15T14:57:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!