పా రంజిత్ డైరెక్షన్‌లో కమల్ హాసన్ ..?
ABN , First Publish Date - 2021-11-09T17:03:59+05:30 IST
పా రంజిత్ డైరెక్షన్‌లో కమల్ హాసన్ నటించబోతున్నారనే లేటెస్ట్ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం కమల్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ్ రాజ్ 'విక్రమ్' అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

పా రంజిత్ డైరెక్షన్‌లో కమల్ హాసన్ నటించబోతున్నారనే లేటెస్ట్ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం కమల్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ్ రాజ్ 'విక్రమ్' అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విలక్షణ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకుంది.
అయితే కమల్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్న్లల్ ఇచ్చినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ మరో సెన్సేషనల్ దర్శకుడుగా పాపులర్ అయ్యాడు పా రంజిత్. తనతో కమల్ నెక్స్ట్ సినిమాను చేయనున్నారట. పా రంజిత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 'కబాలి', 'కాలా' చిత్రాలను రూపొందించి తమిళ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్‌గా మారాడు. మరి కమల్ కోసం ఎలాంటి కథను తయారు చేశారో చూడాలి. ఇక త్వరలోనే ఈ కాంబో మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వెలువడే అవకాశాలున్నాయట.
