సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విలన్‌గా చేయడానికైనా ఓకే..: కాజల్‌

ABN, First Publish Date - 2021-03-26T00:59:21+05:30

చాలా మంది హీరోయిన్లకు వివాహం తర్వాత సినీ అవకాశాలు తగ్గిపోతాయి. కోలీవుడ్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనేక మంది హీరోయిన్లు... వివాహం తర్వాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్: చాలా మంది హీరోయిన్లకు వివాహం తర్వాత సినీ అవకాశాలు తగ్గిపోతాయి. కోలీవుడ్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనేక మంది హీరోయిన్లు... వివాహం తర్వాత సినీ అవకాశాలు లేక ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఇపుడు ఇదే పరిస్థితి కాజల్‌ అగర్వాల్‌కు ఏర్పడింది. ప్రస్తుతం ఈమె చేతినిండా తెలుగు, తమిళ చిత్రాలు ఉన్నాయి. కానీ, అవన్నీ పెళ్ళికి ముందు కుదర్చుకున్న ప్రాజెక్టులు. అదేసమయంలో ఆమె పరిస్థితి టాలీవుడ్‌లో కొంత మెరుగ్గా వున్నప్పటికీ.. కోలీవుడ్‌లో మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. అందుకే చివరకు ప్రతినాయక పాత్రలకు కూడా సిద్ధమని తెలిపింది. 


ఇదే విషయంపై ఆమె స్పందిస్తూ, ప్రేమ, చరిత్ర, పురాణ, హాస్యంతో కూడిన కథా పాత్రల్లో నటించడం అమితమైన ఇష్టమని, చివరకు విలన్‌ పాత్రలో కూడా నటిస్తానని చెప్పింది. అంటే సినీ రంగంలో మరికొంత కాలం కొనసాగాలన్న తపనతో కాజల్‌ ప్రతినాయక పాత్రలు చేసేందుకు సిద్ధమైందని చెప్పొచ్చు. అయితే టాలీవుడ్‌లో మాత్రం ఆమె బిజీ హీరోయిన్‌గానే కొనసాగుతుంది.

Updated Date - 2021-03-26T00:59:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!