ధన్యవాదాలు తెలిపిన ‘జగమే తందిరమ్’ నిర్మాతలు
ABN , First Publish Date - 2021-06-20T02:12:31+05:30 IST
కరోనా మహమ్మారి కారణంగా బడా హీరోల నుంచి చిన్న హీరోలు నటించిన చిత్రాలు ఇపుడు నెట్టింట్లోనే రిలీజ్ అవుతున్నాయి. ఆ కోవలో శుక్రవారం ప్రముఖ హీరో ధనుష్ నటించిన ‘జగమే తందిరమ్’ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
కరోనా మహమ్మారి కారణంగా బడా హీరోల నుంచి చిన్న హీరోలు నటించిన చిత్రాలు ఇపుడు నెట్టింట్లోనే రిలీజ్ అవుతున్నాయి. ఆ కోవలో శుక్రవారం ప్రముఖ హీరో ధనుష్ నటించిన ‘జగమే తందిరమ్’ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొత్తం 17 భాషల్లో 190 దేశాల్లో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు టెలికాస్ట్ అయింది. ఇదే విషయంపై వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ చిత్రం విడుదలకు అన్ని విధాలుగా సహకరించిన భాగస్వాములకు, దర్శకుడు, నటీనటులు, వివిధ శాఖాధిపతులకు, సాంకేతిక నిపుణులకు, ఈ చిత్రం విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వెల్లడించాయి.
పైగా అనేక ఆటంకాలను అధికమించి ఈ చిత్రం విజయవంతంగా శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నాయి. ప్రధానంగా రెండేళ్ళ క్రితం ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు తమ హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నాయి. ఈ చిత్రం విడుదలలో కొంత జాప్యం జరిగినప్పటికీ... చిత్రాన్ని విజయవంతంగా రిలీజ్ చేసేలా ప్రోత్సహించిన ప్రతి ఒక్క అభిమానికి ధన్యవాదాలు తెలిపాయి. అలాగే, శుక్రవారం ఓటీటీలో విడుదలైన ‘జగమే తందిరమ్’ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేసి ఆదరించాలని ఆ సంస్థలు విడుదల చేసిన ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
