సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Puneeth Rajkumar అసలు పేరేంటో తెలుసా..? 6 నెలల వయసులోనే తెరపై మెరిసిన ఆ థ్రిల్లర్ సినిమా ఏంటంటే..

ABN, First Publish Date - 2021-10-29T21:25:40+05:30

కన్నడ ప్రముఖ హీరో, పవర్‌స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ ఈ రోజు (శుక్రవారం) తుదిశ్వాస విడిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కన్నడ ప్రముఖ హీరో, పవర్‌స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ ఈ రోజు (శుక్రవారం) తుదిశ్వాస విడిచారు. ఇంట్లో జిమ్‌ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. హాస్పిటల్‌లో పునీత్ తుదిశ్వాస విడిచారు. పునీత్‌ మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పునీత్‌ మరణవార్త విని అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆయన తుదిశ్వాస విడిచిన హాస్పిటల్ వద్దకు తండోపతండాలుగా వస్తున్నారు.


కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మూడో కుమారుడైన పునీత్‌కు చిన్నప్పటి నుంచే సినిమాలపై మక్కువ ఎక్కువ. పునీత్ అసలు పేరు లోహిత్. ఆరు నెలల వయసులోనే పునీత్ వెండితెరపై కనిపించాడు. `ప్రేమద కనికే` అనే థ్రిల్లర్ సినిమాలో నటించాడు. బాలనటుడిగా అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. `బెట్టడా హువు` చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. హీరోగా ఇప్పటివరకూ పునీత్ 32 చిత్రాల్లో నటించారు. `వసంత గీత`, `భాగ్యవంత`, `యరివాను` మొదలైన సినిమాలు పునీత్‌కు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇటీవల `యువరత్న` సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా పునీత్‌ సుపరిచితమే. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. 


Updated Date - 2021-10-29T21:25:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!