ఎన్ని రోజుల్లో 'పొన్నియన్ సెల్వన్' పూర్తవుతుందంటే..!

ABN , First Publish Date - 2021-06-17T16:59:48+05:30 IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కితున్న సినిమా 'పొన్నియన్ సెల్వన్'. కల్కి కృష్ణమూర్తి రచించిన నాలుగు నవలల సంకలనం 'పొన్నియన్ సెల్వన్' అనే నవల ఆధారంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. గత కొన్నేళ్ళుగా ఈ నవలను సినిమా తీయాలని చాలామంది దర్శకులు అనుకున్నప్పటికి సాధ్యపడలేదు.

ఎన్ని రోజుల్లో 'పొన్నియన్ సెల్వన్' పూర్తవుతుందంటే..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కితున్న సినిమా 'పొన్నియన్ సెల్వన్'. కల్కి కృష్ణమూర్తి రచించిన నాలుగు నవలల సంకలనం 'పొన్నియన్ సెల్వన్' అనే నవల ఆధారంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. గత కొన్నేళ్ళుగా ఈ నవలను సినిమా తీయాలని చాలామంది దర్శకులు అనుకున్నప్పటికి సాధ్యపడలేదు. చివరికి మణిరత్నం ఈ చిత్రాన్ని తెకెక్కించడానికి పూనుకున్నారు. ఎప్పుడ్పో షూటింగ్ పూర్తవ్వాల్సిన 'పొన్నియన్ సెల్వన్' లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. విదేశాల్లో షూటింగ్ జరపాల్సి ఉండటంతో మేజర్ టాకీపార్ట్ బ్యాలెన్స్ ఉండిపోయింది. 


ఈ బ్యాలెన్స్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఇంకా 50 నుంచి 60 రోజులు పడుతుందట. హార్స్ రైడింగ్, ఛేజింగ్ సన్నివేశాలు ఎక్కువగా బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సన్నివేశాలను థాయ్ లాండ్, మధ్యప్రదేశ్, కేరళ లాంటి రియల్ లొకేషన్లలో చిత్రీకరణ జరపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఇందులో విక్రమ్, అమితాబ్, ఐశ్వర్యరాయ్, త్రిష, నయనతార, విజయ్ సేతుపతి, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు, జయరామ్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. 

Updated Date - 2021-06-17T16:59:48+05:30 IST