సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇసైజ్ఞాని సంగీతంలో 1,417వ చిత్రంగా ‘నినైవెల్లామ్‌ నీయడా’

ABN, First Publish Date - 2021-09-24T17:18:15+05:30

సంగీత మేధావి ఇళయరాజా కొన్ని దశాబ్దాలుగా సంగీతం సమకూర్చుతున్నారు. ఆయన ఇప్పటివరకు 1,416 చిత్రాలకు సంగీతబాణీలు సమకూర్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 1,417 చిత్రంగా ‘నినైవెల్లామ్‌ నీయడా’ అనే చిత్రానికి ఆయన సంగీత దర్శకత్వం వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగీత మేధావి ఇళయరాజా కొన్ని దశాబ్దాలుగా సంగీతం సమకూర్చుతున్నారు. ఆయన ఇప్పటివరకు 1,416 చిత్రాలకు సంగీతబాణీలు సమకూర్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 1,417 చిత్రంగా ‘నినైవెల్లామ్‌ నీయడా’ అనే చిత్రానికి ఆయన సంగీత దర్శకత్వం వహించనున్నారు. లేఖ థియేటర్స్‌ పతాకంపై రాయల్‌ బాబు నిర్మించే ఈ చిత్రంలో హీరోగా ప్రిజన్‌ నటిస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లు వుండే ఈ మూవీలో ఒకరిగా ప్రముఖ నటిని తీసుకొని మరో హీరోయిన్‌గా కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. 


ఇందులో ఇంకా..  యువలక్ష్మి, అభినయశ్రీ, మనోబాలా, కాళి వెంకట్‌, మధుమిత, రంజన్‌కుమార్‌ తదితరులు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. ఆదిరాజన్‌ దర్శకుడు. ప్యార్‌ ప్రేమ కాదల్‌ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేసిన రాజా భట్టాచార్జి ఛాయాగ్రహకుడుగా పనిచేస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు అదిరాజన్‌ మాట్లాడుతూ, ‘కాదలై కొండాడియ అళగి’, ‘ఆటోగ్రాఫ్‌’, ‘పల్లిక్కూడం’, ‘96’ వంటి చిత్రాల బాణీలో తమ యుక్త వయస్సు తొలిప్రేమను మరచిపోలేని ప్రేమజంట గురించిన కథ’ అని వివరించారు.  

Updated Date - 2021-09-24T17:18:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!