సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

భయపెడుతున్న 'ఇడియట్‌' ట్రైలర్‌

ABN, First Publish Date - 2021-04-26T21:45:20+05:30

ప్రస్తుతం హర్రర్ అండ్ కామెడీతో తెరకెక్కుతున్న సినిమాలకి అన్నీ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఎక్కుడు మాస్ అండ్ యాక్షన్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ తరహా సినిమాలు కాస్త ఎక్కువ ఎంటర్‌టైన్మెంట్‌ను ఇస్తున్నాయి. అందుకే ఈ జోనర్‌లో తెరకెక్కే సినిమాలు సీక్వెల్స్‌గానూ తయారవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం హర్రర్ అండ్ కామెడీతో తెరకెక్కుతున్న సినిమాలకి అన్నీ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఎక్కుడు మాస్ అండ్ యాక్షన్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ తరహా సినిమాలు కాస్త ఎక్కువ ఎంటర్‌టైన్మెంట్‌ను ఇస్తున్నాయి. అందుకే ఈ జోనర్‌లో తెరకెక్కే సినిమాలు సీక్వెల్స్‌గానూ తయారవుతున్నాయి. ఎక్కువగా రాఘవ లారెన్స్ నుంచి ఈ తరహా సినిమాలు వచ్చి మంచి సక్సస్‌ను సాధిస్తున్నాయి. అలాంటి హర్రర్ అండ్ కామెడీ జోనర్‌లో తెరక్కెకిన లేటెస్ట్ తమిళ సినిమా 'ఇడియట్‌' . స్ర్కీన్‌ సీన్‌ మీడియా ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై నిర్మితమైన సినిమాలో మిర్చి శివ, నిక్కీ గల్రానీ, ఆనంద్‌రాజ్‌, ఊర్వశి, అక్షర గౌడ, సింగముత్తు, రవి మరియా, కింగ్స్‌లీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి రంభాలా దర్శకత్వం వహించారు. ఈయన గతంలో 'లొల్లు సభ', 'దిల్లుక్కు దుడ్డు', 'దిల్లుక్కు దుడ్డు-2' వంటి చిత్రాలను నిర్మించారు. ఇపుడు కూడా వాటి తరహాలోనే హర్రర్‌, హాస్యంతో కూడిన చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం రిలీజ్‌ చేశారు. ఈ టరిలర్‌ను చూస్తే ఒక బంగాళాకు వెళ్ళిన కొందరిని.. ఈ బంగళాలోని దెయ్యం ఏ విధంగా భయపెట్టిందన్న కథాంశంతో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని సన్నివేశాలను కూడా పూర్తిగా హాస్యభరితంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం విక్రమ్‌ సెల్వ అందించగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.



Updated Date - 2021-04-26T21:45:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!