పక్కా తమిళ అమ్మాయిని..: యువన్ శంకర్ రాజా భార్య
ABN , First Publish Date - 2021-05-30T02:20:30+05:30 IST
కోలీవుడ్‌లోని యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన జఫ్రూన్ నిజర్ అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఇందుకోసం యువన్ శంకర్ రాజా 2014లో ముస్లిం మతం స్వీకరించారు. అలాగే, తన పేరును కూడా అబ్దుల్ ఖాలిక్‌గా

కోలీవుడ్‌లోని యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన జఫ్రూన్ నిజర్ అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఇందుకోసం యువన్ శంకర్ రాజా 2014లో ముస్లిం మతం స్వీకరించారు. అలాగే, తన పేరును కూడా అబ్దుల్ ఖాలిక్‌గా మార్చుకున్నారు. నిజర్ ఒక కాస్ట్యూమ్ డిజైనర్. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఒక పాప కూడా ఉంది. తన భర్త యువన్‌తో కలిసి అత్యంత అరుదుగానే నిజర్ బాహ్య ప్రపంచంలో కనిపిస్తుంటారు. ఆమె చాలా వరకు మీడియాకు దూరంగా ఉంటారు. అయితే, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలో ఆమె తొలిసారి తన భర్త గురించి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ యువన్ శంకర్ రాజా ఆధ్వర్యంలో నడిచే ‘యు-1’ అనే యూట్యూబ్ చానెల్‌లో ప్రసారమైంది.
ఈ ఇంటర్వ్యూలో నిజర్ మాట్లాడుతూ.. ‘‘యువన్ సతీమణిగా ఉండటంతో నేను కూడా పాటలు పాడుతుంటాను. సంగీతం గురించి బాగా తెలుసని అనుకుంటారు. నిజానికి సంగీతం గురించి అస్సలు తెలియదు. అయితే, యువన్ సంగీతం ఇతరులు వినే కంటే ముందుగా నేనే తొలిసారి వింటాను. అలా తొలి అనుభవం నాకు కలగడం ఎంతోషంగా ఉంది. ఈ ప్రపంచం మనం చూసే కోణంపై ఆధారపడి ఉంటుంది. అలాగే, ఆకారాన్నిబట్టి దేన్ని కూడా అంచనా వేయలేం. ఈ విషయం నాకు బాగా తెలుసు. ఒక ముఖ్యమైన విషయమేమిటంటే.. నన్ను ప్రతి ఒక్కరూ ముస్లిం అనుకుంటారు. నిజం చెప్పాలంటే, నేను పక్కా తమిళ అమ్మాయిని. తమిళం నా మాతృభాష’’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.