ఇండియాలో హాలీవుడ్ చిత్రాల రిలీజ్లు ఎప్పుడంటే?
ABN , First Publish Date - 2021-06-23T01:10:58+05:30 IST
కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసింది. ఇక మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో..

కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసింది. ఇక మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో థియేటర్స్ ఓపెనింగ్‌పై పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హాలీవుడ్ చిత్రాలను పంపిణీ చేసే కెజీయఫ్ సంస్థ ప్రతినిధి స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘‘కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు క్రమంగా కంట్రోల్‌కి వస్తున్నాయి. అయితే ఆల్ ఇండియా రేంజ్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయలేదు. జూలై మొదటి వారంలో థియేటర్స్ ఓపెన్ చేయాలా వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకోబోతున్నాం. తెలంగాణలో లాక్డౌన్ తీసేశారు. కానీ కర్ణాటక, కేరళ, తమిళనాడులో లాక్డౌన్ కొనసాగుతోంది. మేం హాలీవుడ్ మూవీలనే విడుదల చేస్తున్నాం. వీటిని ఇంగ్లీష్‌తో పాటు తెలుగు అనువాదంలోనూ విడుదల చేయడానికి ఎదురుచూస్తున్నాం. డిసెంబర్ వరకు పది సినిమాలను విడుదల చేయాల్సి ఉంది. కంజరింగ్ 3, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9, టాప్ గన్, సూసైడ్ స్క్వాడ్, నో టైమ్ టు డై, స్నేక్ ఐస్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ ఆల్ ఓవర్ ఇండియా విడుదల కానున్నాయి’’ అని తెలిపారు.