‘ సమంత ’తో సినిమా చేయనున్న Hrithik Roshan ..?

ABN , First Publish Date - 2021-12-23T22:07:19+05:30 IST

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌కు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు

‘ సమంత ’తో  సినిమా చేయనున్న Hrithik Roshan ..?

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్‌కు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. హృతిక్ అభిమానులకు ఆనందం కలిగించే తీపి వార్త ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. త్వరలోనే అతడు హాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ స్టార్ అయిన సమంత లాక్‌వుడ్‌తో కలిసి సినిమా చేయబోతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా హృతిక్‌తో తీసుకున్న ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఆమె పోస్ట్ చేసింది. దీంతో వారిద్దరూ కలిసి ఒక చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.


సమంత అమెరికాకు చెందిన మోడల్, నటి. ఆమె గతంలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. షూట్ ద హీరో సినిమా ఆమెకు ఎంతగానో పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చింది. ఆ సినిమా 2010లో విడుదలైంది. గత కొన్ని రోజులుగా ఆమె ముంబైలోనే ఉంటుంది. ఒక ప్రాజెక్టు కోసం పనిచేయబోతున్నట్టు అప్పట్లోనే వార్తలు వెలువడ్డాయి. సమంత, హృతిక్ ఇద్దరు కలిసి అనేక ఫొటోలు తీసుకున్నారు. కానీ, సినిమా చేస్తున్నట్టు మాత్రం అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. 



Updated Date - 2021-12-23T22:07:19+05:30 IST