ధనుష్‌కు హైకోర్టు చివాట్లు!
ABN , First Publish Date - 2021-08-05T22:04:17+05:30 IST
రజనీకాంత్ అల్లుడు, తమిళ స్టార్ ధనుష్‌కు మద్రాస్ హైకోర్టు చివాట్లు పెట్టింది. లగ్జరీ కారు కొనుగోలు విషయంలో పన్ను కట్టి తీరాల్సిందేనని కోర్టు తీర్పు ఇచ్చింది. సామాన్య ప్రజలే పన్ను కడుతున్నప్పుడు సెలబ్రిటీలకు ఇబ్బంది’ అని ప్రశ్నించింది.

రజనీకాంత్ అల్లుడు, తమిళ స్టార్ ధనుష్‌కు మద్రాస్ హైకోర్టు చివాట్లు పెట్టింది. లగ్జరీ కారు కొనుగోలు విషయంలో పన్ను కట్టి తీరాల్సిందేనని కోర్టు తీర్పు ఇచ్చింది. సామాన్య ప్రజలే పన్ను కడుతున్నప్పుడు సెలబ్రిటీలకు ఇబ్బంది’ అని ప్రశ్నించింది. అసలు విషయానికొస్తే.. 2015లో ధనుష్ రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నందుకుగాను చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆ సంవత్సరమే కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయన వేసిన మరో పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లగ్జరీ కారు కొనుగోలు చేసి.. పన్ను మినహాయింపు ఎలా అడుగుతున్నారు? అని కోర్టు నిలదీసింది. ఇప్పటికే తాను 50 శాతం పన్ను చెల్లించానని మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 9న చెల్లిస్తానని ఆయన సమాధానమిచ్చారు.