‘బిగ్బాస్’తో అవకాశాలేం పెరగలేదు: హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-01-01T04:00:23+05:30 IST
బిగ్బాస్ రియాల్టీ షోలో పాల్గొనడం వల్ల తనకు ఏమాత్రం సినిమా అవకాశాలు పెరగలేదని తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ రియాల్టీ షో వల్ల వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎలాంటి ప్రయోజనం
కోలీవుడ్లో ఉన్న హీరోయిన్లలో సనమ్ శెట్టి ఒకరు. బిగ్బాస్ తమిళ 4వ సీజన్ రియాల్టీ షోలో పాల్గొనడం వల్ల తనకు ఏమాత్రం సినిమా అవకాశాలు పెరగలేదని తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ రియాల్టీ షో వల్ల వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఆమె తమిళ చిత్రపరిశ్రమలో దాదాపు 25కు పైగా చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ.. ఆమెకు సరైన అవకాశాలు లేకపోవడంతో కెరీర్ కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. రెండు పదులకు పైగా చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు కూడా రాలేదు. అదే సమయంలో బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమెకు కొంతమేరకు సోషల్ మీడియాలో గుర్తింపు అయితే వచ్చింది. ఇప్పుడు ఆమె నటించిన ఓ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బిగ్బాస్ రియాల్టీ షో వల్ల ఎలాంటి ఉపయోగం లేదని సనమ్ శెట్టి పేర్కొంది.