తొలిసారి గ్రామీణ నేపథ్యంలో థ్రిల్లర్‌ ఫిల్మ్.. హీరో ఎవరంటే?

ABN , First Publish Date - 2021-08-05T03:30:10+05:30 IST

కరోనా మార్గదర్శకాలకు లోబడి ఈ సినిమా షూటింగు ప్లాన్‌ చేశాం. గ్రామీణ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ను ఈ మూవీతో తొలిసారి చూస్తారని నిర్మాత..

తొలిసారి గ్రామీణ నేపథ్యంలో థ్రిల్లర్‌ ఫిల్మ్.. హీరో ఎవరంటే?

స్కై మ్యాన్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ అధినేత కలైమగన్‌ ముబారక్‌ నిర్మాణ సారథ్యంలో ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత శీను రామస్వామి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నంబర్‌ 2 చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌, గాయత్రి శంకర్‌ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూజా కార్యక్రమాలు తాజాగా చెన్నై నగరంలో జరిగాయి. చిత్ర నిర్మాత ముబారక్‌ కెమెరా స్విచాన్‌ చేయగా తొలి సన్నివేశాన్ని దేవుడి పటాలపై చిత్రీకరించారు. 


ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. తమ సంస్థ నిర్మించే రెండో చిత్రం ఇది. ఓ మంచి శుభముహూర్తాన ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. శీను రామస్వామి వంటి గొప్ప దర్శకుడు, ఎంతో ప్రతిభావంతమైన నటీనటులతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా వుంది. శీను రామస్వామి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఓ మంచి కథతో రూపొందిస్తున్నాం. జీవీ ప్రకాష్‌ నటన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీకి మరింత బలం చేకూర్చుతుంది. ఇక హీరోయిన్‌ గాయత్రి నటనా ప్రతిభ మరింత ప్లస్‌ అవుతుంది. తొలి షెడ్యూల్‌ను ఏకధాటిగా 25 రోజుల పాటు ప్లాన్‌ చేశాం. కరోనా మార్గదర్శకాలకు లోబడి ఈ సినిమా షూటింగు ప్లాన్‌ చేశాం. గ్రామీణ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ను ఈ మూవీతో తొలిసారి చూస్తారని తెలిపారు.

Updated Date - 2021-08-05T03:30:10+05:30 IST