భారతీరాజా కుమారుడి పేరుతో మోసం

ABN , First Publish Date - 2021-07-27T18:58:04+05:30 IST

ప్రముఖ దర్శకుడు భారతీరాజా కుమారుడు మనోజ్‌ భారతీరాజా పేరుతో ఓ వ్యక్తి డబ్బు వసూళ్ళకు శ్రీకారం చుట్టిన వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

భారతీరాజా కుమారుడి పేరుతో మోసం

ప్రముఖ దర్శకుడు భారతీరాజా కుమారుడు మనోజ్‌ భారతీరాజా పేరుతో ఓ వ్యక్తి డబ్బు వసూళ్ళకు శ్రీకారం చుట్టిన వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. మనోజ్‌ భారతీరాజా, ఆయన కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో వున్నారని, అందువల్ల తమను ఆదుకోనేలా ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో ఒక మెసేజ్‌ పోస్ట్‌ చేశాడు. దీన్ని చూసిన 40 మందికి పైగా తమకు తోచిన విధంగా ఆర్థికసహాయం చేశారు. అయితే, ఈ విషయం మనోజ్‌ భారతీరాజాకు తెలియడంతో వెలుగులోకి వచ్చింది. 

Updated Date - 2021-07-27T18:58:04+05:30 IST