ఎక్స్‌పోజింగ్‌లో దుషారా.. దుమ్మురేపుతోందిగా..! వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-11-16T22:29:33+05:30 IST

ఇటీవల పా. రంజిత్‌ దర్శకత్వంలో ఆర్య హీరోగా వచ్చిన ‘సార్బట్టా పరంపరై’ చిత్రంలో ‘మారియమ్మ’ పాత్రలో నటించి ప్రతి ఒక్కరితో శభాష్‌ అనిపించుకున్న నటి దుషారా విజయన్‌. తమిళనాడుకు చెందిన ఈ యువ నటి ఇపుడు ఉన్నట్టుండి ప్రత్యేక..

ఎక్స్‌పోజింగ్‌లో దుషారా.. దుమ్మురేపుతోందిగా..! వీడియో వైరల్

ఇటీవల పా. రంజిత్‌ దర్శకత్వంలో ఆర్య హీరోగా వచ్చిన ‘సార్బట్టా పరంపరై’ చిత్రంలో ‘మారియమ్మ’ పాత్రలో నటించి ప్రతి ఒక్కరితో శభాష్‌ అనిపించుకున్న నటి దుషారా విజయన్‌. తమిళనాడుకు చెందిన ఈ యువ నటి ఇపుడు ఉన్నట్టుండి ప్రత్యేక ఫోటోషూట్‌ కోసం ఎక్స్‌పోజింగ్‌కు దిగింది. ఈ ఫొటోలు ఒక్కసారిగా ట్రెండ్‌ కావడంతో ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు. ‘సార్బట్టా పరంపరై’ చిత్రంలో ఎంతో సంప్రదాయబద్ధమైన గృహిణి పాత్రలో దుషారా విజయన్‌ మెప్పించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆమె నటిస్తోంది కూడా. ఈ నేపథ్యంలో తాజాగా తెలుపు రంగు దుస్తులు ధరించి పడక గదిలో బెడ్‌పై వివిధ రకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజులిచ్చి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫొటో సెషన్‌కి సంబంధించిన వీడియో‌ని కూడా ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.Updated Date - 2021-11-16T22:29:33+05:30 IST